- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు సాయమందించడం అభినందనీయం
దిశ, మెదక్ : కరోనా దెబ్బకు నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీకు మేమున్నామంటూ పలువురు దాతలు ముందుకొస్తున్నారు.ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ముందుకు రాగా, మంత్రి హరీశ్ రావు పిలుపు మేరకు సిద్ధిపేటకు చెందిన నీలకంఠ సమాజం రూ.2లక్షలు, ప్రముఖ వైద్యులు నర్సింహ చారి రూ.1లక్ష, సిద్దిపేట సిటిజన్ క్లబ్ రూ.51వేలు, సిద్దిపేటలోని ప్రతిభ విద్యాసంస్థల తరుపున రూ.20వేల విరాళం ప్రకటించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన నీలకంఠ సమాజం…
నీలకంఠ సమాజం వారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2లక్షలతో పాటు 150 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.మంగళవారం సిద్దిపేట నీలకంఠ సమాజం తరఫున ప్రతినిధులు, మునిసిపల్ చైర్మన్ రాజనర్సు, అధ్యక్షుడు లోక లక్ష్మీ రాజ్యం, కడవేరుగు నర్సింలు, శ్రీనివాస్‌లు రూ.2లక్షల చెక్కును మంత్రి హరీష్‌కు అందజేశారు. అలాగే మగ్గం నేసే 150మంది పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్టు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి హరీష్ రావు నీలకంఠ సమాజ ప్రతినిధులను అభినందించారు.
పేదలకు సాయం చేయడం స్ఫూర్తి దాయకం..
సిద్ధిపేటలోని ప్రముఖ వైద్యులు డా.నర్సింహ చారి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మంత్రి నివాసంలో హరీష్ రావు పిలుపు మేరకు రూ.1లక్ష సీఎం రిలీఫ్ ఫండ్కు ఇస్తున్నట్టు చెప్పారు.
సిద్దిపేట సిటిజన్ క్లబ్ 51వేలు విరాళం
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా సామాజిక సేవా సంస్థ సిటిజన్ క్లబ్ ప్రతినిధులు మల్లారెడ్డి , మల్లేశం రూ. 51వేల చెక్కును మంత్రి హరీశ్ రావుకు అందజేశారు.
ప్రతిభా కళాశాలల విద్యాసంస్థలు రూ.20వేలు విరాళం..
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలకు సిద్దిపేటలోని ప్రముఖ విద్యాసంస్థలు ప్రతిభ కళాశాల వారు సీఎం సహాయ నిధికి రూ.20వేలు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నివాసంలో విద్యాసంస్థల ప్రతినిధులు సూర్య ప్రకాష్ , బాల్ కిషన్ మంత్రి చెక్ అందజేశారు.
కిట్స్ కళాశాల విద్యార్థులు రూ.11వేల విరాళం..
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మేము సైతం అంటూ వరంగల్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థ కిట్స్ కళాశాల విద్యార్థులు పేదలకు సాయం అందించేందుకు రూ.11వేలు విరాళంగా ఇచ్చారు. వీరంతా కౌన్సిలర్ బ్రహ్మంతో కలసి మంత్రి హరీష్ రావుకు ఆయన ఇంట్లో చెక్ అందజేశారు..
Tags: carona, lockdown, minister harish rao, funds donate by someones, cmrf