జస్టిస్ కేశవ రావు మృతి పట్ల కేసీఆర్ సంతాపం

by Shyam |   ( Updated:2021-08-08 23:23:28.0  )
Chief-Minister-KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు మృతి పట్ల ముఖ్య మంత్రి కేసీఆర్, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు పేదలకు అందించిన న్యాయసేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్ కేశవరావు కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. అలాగే చాలా సాధారణ జీవితం గడిపిన కేశవ రావు మంచి విలువలున్న మానవతావాది అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. కేశవరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Next Story