- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను తిట్టినా ఫర్వాలేదు.. సీఎం కేసీఆర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగా తనను తిట్టినా ఫర్వాలేదని, కానీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అవమానించడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఏర్పడిందని, అనేక విషయాల్లో ఇతర రాష్ట్రాల కంటే ఉన్నతంగా ఉన్నదని, రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్టను మలినం చేయడం, చిన్నబుచ్చడం మంచిది కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మెట్రో రైల్ నిర్మాణం సమయంలో కొద్దిమంది ప్రతినిధులు వచ్చి కేంద్రం నుంచి వయబిలిటీ ఫండ్ రాదని, తెలంగాణ ఏర్పాటు కారణంగానే ఈ పరిణామం వచ్చిందంటూ మాట్లాడారని, కానీ వారిని తిట్టి పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,.. రాజకీయ ప్రయోజనాల కోసం ఏది మాట్లాడినా ఫర్వాలేదుగానీ, మన రాష్ట్రాన్ని మనం కించపర్చుకోవడం మంచిది కాదని విపక్షాలకు హితవు పలికారు.
తెలంగాణ ఏర్పడడానికి పూర్వం పాలమూరు లాంటి జిల్లాల నుంచి ఉపాధి కోసం వలసలు వెళ్ళే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఇతర జిల్లాల నుంచి పాలమూరుకు కూలీ పని కోసం వలస వస్తున్నారని, వేలాది మంది కర్నూలు జిల్లా నుంచి వచ్చి పత్తి తీస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడినందున ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల నుంచి సుమారు 15 లక్షల మంది వచ్చి ఇక్కడ రకరకాల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. చివరకు నాట్లు వేయడానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచే కూలీలు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సౌకర్యాలు, పరిశ్రమలు, ఆయా రంగాల వృద్ధి పెరిగినందునే ఈ పరిణామం ఏర్పడిందన్నారు.