- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ కీలక హామీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలపై దృష్టిసారిస్తామని, త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో పన్నుల రూపంలో వసూలు చేసి తక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తున్నారన్నారు. త్వరలోనే యాదాద్రి ఆలయాన్ని ప్రారంభిస్తామని, ఈ మహోత్సవానికి ప్రధానిని పిలిచానని.. ఆయన వస్తానని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలతో పాటు ఓసీల్లోనూ చాలా మంది పేదలు ఉన్నారని, వారికి పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెబుతుంది, కానీ సంక్షేమంతో పాటు మూలధన పెట్టుబడులు పెంచుతున్నామని కేసీఆర్ ప్రకటించారు.