- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరగంటలో బెడ్స్ రెడీగా ఉండాలి : జగన్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ఆస్పత్రుల్లో రోగులు ఎవరైనా కాల్ చేసిన అరగంటలోపే బెడ్స్ రెడీ చేయాలని సీఎం జగన్ సంబంధిత వైద్యాశాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీలో కొవిడ్ వ్యాప్తి పరిస్థితులపై అమరావతిలోని క్యాంప్ ఆఫీసు కేంద్రంగా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆస్పత్రుల్లో బాధిత రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
అదేవిధంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. చికిత్స కోసం వచ్చిన వారికి నాణ్యతో కూడిన ఆహారం, ఆరోగ్య మిత్రలు అన్ని వేళలా ఉండాలని చెప్పారు. ఏపీలోని ఆస్పత్రుల్లో వైద్య సేవల అందుబాటు తీరును పరిగణలోనికి తీసుకుని గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 104కాల్ సెంటర్ మరింత సమర్థంగా పనిచేయాలని, ఆస్పత్రుల్లో నాణ్యతపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
ప్రతిరోజూ కరోనా రోగులకు తప్పసిసరిగా మాక్ కాల్స్ చేయాలని, ఫోన్ చేసిన అరగంటలోపు బెడ్ల కేటాయింపు జరగాలన్నారు. అంతేకాకుండా హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు మెడికల్ కిట్లు అందించాలని పేర్కొన్నారు. రోగులకు డాక్టర్లు, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండాలని సమీక్షలో సీఎం జగన్ స్పష్టంచేశారు.