- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక శాఖతో సీఎం జగన్ చర్చలు.. పీఆర్సీపై కీలక నిర్ణయం..
దిశ, ఏపీ బ్యూరో : ఉద్యోగుల ఆందోళనలపై వైసీపీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఇప్పటికే పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఆ మేరకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణపై సీఎం చర్చిస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. కమిషన్ సిఫార్సులను పరిశీలించి పీఆర్సీ ఎంతమేర ఇవ్వాలి అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లపైనా సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. అలాగే గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులకు ప్రొహిబిషన్ ఖరారుపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. మరోవైపు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ అయినప్పుడు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. పీఆర్సీపై గురువారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.