- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన పారిశ్రామిక విధానం ప్రారంభం
దిశ, వెబ్డెస్క్ : ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020-23 పారిశ్రామిక విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం ‘జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం’ పేరిట సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని.. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించేందుకు రాష్ట్రంలో రూ.1 కోటి ఇన్సెంటివ్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. వారిని ప్రొత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని.. దీనిలో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు పరిశ్రమ పెట్టాలనుకుంటే వారు ఎలా చేయాలి.? ఎవరిని కలవాలి.? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.