- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుల్లారా.. ఆర్మీ పిలుస్తోంది తరలండి!
న్యూఢిల్లీ: వృత్తిరీత్యా సైన్యంలో చేరే పరిస్థితులు లేకున్నా.. కొన్నాళ్లైనా సైనికులుగా ఉండాలని ఆశపడే యువతకు ఇండియన్ ఆర్మీ అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. సైన్యంలో తాత్కాలికంగా అంటే మూడేళ్లపాటు జవాన్ అయ్యే అవకాశాన్ని ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. కేవలం సైనిక దళాల్లోనే కాదు.. అధికారుల స్థాయిలోనూ మూడేళ్ల కాలానికి రిక్రూట్ చేసుకునేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. జాతీయవాదం, దేశభక్తి పెరుగుతున్నతరుణంలో యువత అభిలాషను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయానికి అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. అయితే, ఈ విషయంపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆర్మీ ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ఈ నిర్ణయానికి ఆమోదం లభిస్తే.. తొలుత 1,000 మంది సైనికులు, 100 మంది అధికారుల నియామకాల కోసం కసరత్తులు జరుగుతాయని చెప్పారు. నియామక ప్రక్రియలో ఎటువంటి సడలింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అలాగే, నియామకానికి అర్హతలపైనా చర్చలుంటాయని, టూర్ ఆఫ్ డ్యూటీ లేదా మూడేళ్ల షార్ట్ సర్వీస్ స్కీమ్ కింద చేసుకునే ఈ రిక్రూట్‌మెంట్‌లో పౌరుల వయస్సు, ఫిట్‌నెస్ కీలకాంశంగా ఉండనున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.