- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రాపో-22’ నుంచి సూపర్ అప్‌డేట్.. తదుపరి షెడ్యూల్ అక్కడే స్టార్ట్ అంటూ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) బ్యాక్ టు బ్యాక్ సినిమాతో తన పాపులారిటీ పెంచుకుంటున్నారు. గత ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’(Double Ismart) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న తాజా మూవీ ‘రాపో-22’(Rappo-22). దీనిని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) ఫేమ్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravishankar) యలమంచిలి నిర్మిస్తున్నారు.
ఇందులో యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Bhorse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు రామ్ పోతినేని స్వయంగా ఓ పాటను కూడా రాబోతున్నట్లు టాక్. కాగా రాపో-22 తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం వివేక్(Vivek), మెర్విన్(Mervin) సంగీతం అందిస్తున్నారు.
ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల్లో రెండవ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా 34 రోజుల పాటు నిరంతరం రెండు పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన తారాగణంతో కూడిన కీలక సన్నివేశాలను పూర్తి చేసింది ఈ బృందం. తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.