Apple Watch: ఇంటిగ్రేటెడ్ కెమెరాతో యాపిల్ అప్ కమింగ్ వాచ్...లాంఛ్ ఎప్పుడో తెలుసా?

by Vennela |
Apple Watch:  ఇంటిగ్రేటెడ్ కెమెరాతో యాపిల్ అప్ కమింగ్ వాచ్...లాంఛ్ ఎప్పుడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : Apple Watch: యాపిల్ వాచ్ అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ వాచ్. కంపెనీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కామెరాతో దీన్ని ప్యూచర్ ఇటెరేషన్ కోసం డెవలప్ చేస్తోందని ఆదివారం ప్రచురించిన బ్లూమ్ బెర్గ్ రిపోర్టు తెలిపింది. ఇన్ సైడ్ ది డిస్ ప్లే కెమెరాతో యాపిల్ వాచ్ స్టాండర్డ్ మోడల్, డిజిటల్ క్రౌన్ పక్కన కనిపించే కెమెరాతో అల్ట్రా మోడల్ మరో రెండేళ్లలో ప్రారంభించనున్నట్లు ఈ రిపోర్టు తెలిపింది.

బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం కెమెరాతో కూడిన యాపిల్ వాచ్ బయటి ప్రపంచాన్ని చూడగలదు. సంబంధిత సమాచారాన్ని అందించేందుకు ఏఏఐని వినియోగించగలదు. ఇది ప్రస్తుతం కెమెరా కంట్రోల్ బటన్ తో ఐఫోన్ లకు పరిమితం చేసిన విజువల్ ఇంటెలిజెన్స్ ను యాపిల్ వాచ్ లకు విస్తరిస్తుంది. అంతేకాదు యాపిల్ కెమెరాతో కూడిన ఎయిర్ పాడ్స్ ప్రో మోడల్ పై కూడా పనిచేస్తుందని నివేదించింది. ఇది కూడా ఇలాంటి సిమిలర్ కెపాసిటిలను అందిస్తుందని అంతా భావిస్తున్నారు.

ఈ అప్ కమింగ్ యాపిల్ వాచ్, ఎయిర్ పాడ్స్, యాపిల్ ఇంటెలిజెన్స్ కు సపోర్ట్ చేసే ఐఫోన్ జత చేసినప్పుడు ఈ కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇందులో పరిసరాలను స్కాన్ చేసే కెపాసిటీ,పర్సనలైజ్డ్ ఇన్ సైట్స్ ను అందించడం, యూజర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటివి కూడా ఉంటాయి. అయితే త్వరలోనే కెమెరా విజువల్ ఇంటెలిజెన్స్ తో కూడిన యాపిల్ వాచ్ ఎంట్రీ ఇచ్చే చాన్స్ లేదు. ఈ ఫీచర్లు 2027నాటికి మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఇన్ హౌస్ ఏఐ మోడల్స్ ద్వారా శక్తిని పొందుతాయి.

ఇక యాపిల్ కొన్ని ఏఐ ఫీచర్లను అందించడంలో ముఖ్యంగా పునర్మిర్మించిన వ్యక్తిగతీకరించిన సిరిని అందించడంలో ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. దీంతో కంపెనీ తన లీడర్ సిప్ టీమ్ ను మార్చినట్లు నివేదించింది. రీవెంప్ట్ సిరి కనీసం 2026 చివరి వరకు ఐఓఎస్ 20 వరకు రాకపోవచ్చు. బ్లూమ్ బెర్గ్ కూడా యాపిల్ ఎంటైర్ పర్సనలైజ్డ్ సిరి ఎక్స్ పీరియన్స్ ను మొదటి నుంచి పునర్మిస్తున్నట్లు నివేదించింది.

Next Story

Most Viewed