Rahul : విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం.. రాహుల్ గాంధీ విమర్శలు

by vinod kumar |
Rahul : విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నం.. రాహుల్ గాంధీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rss) ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్తే భవిష్యత్‌లో ఎవరికీ ఉపాధి లభించబోదని తెలిపారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి (India alliance) పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగించారు. ‘ఆర్ఎస్ఎస్ అనే సంస్థ దేశ భవిష్యత్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. విద్యా వ్యవస్థను నెమ్మదిగా వారి చేతుల్లోకి తీసుకుంటోంది. ఇదే జరిగితే దేశం నాశనం అవుతుంది. ఎవరికీ ఉద్యోగం లభించదు’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే ఉన్నారని, రాబోయే కాలంలో వారి సిఫార్సుల మేరకే వీసీలను నియమిస్తారు. దీనిని ఆపకపోతే దేశానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.

ఇటీవల ప్రధాని మోడీ పార్లమెంటులో మహాకుంభమేళా (Mahakumbamela) పై వ్యాఖ్యలు చేశారని, అదే టైంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం గురించి కూడా మాట్లాడితే బాగుండేదని తెలిపారు. దేశంలోని వనరులను అదానీ, అంబానీలకు అప్పగించడం, సంస్థలను ఆర్ఎస్ఎస్‌కు అప్పగించడమే మోడీ లక్ష్యమని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమిలోని పార్టీలకు వారి విధానాల్లో, సిద్ధాంతాల్లో స్పల్ప తేడాలు ఉండొచ్చని కానీ దేశ విద్యా వ్యవస్థపై ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. దేశంలోని ప్రతి మూలలో, ప్రతి వీధిలో, ప్రతి విశ్వవిద్యాలయంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed