- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Salaar 2: రెబల్‌స్టార్ ఫ్యాన్స్‌కు భారీ శుభవార్త.. సలార్ 2 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన నటుడు

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas) నటించిన సలార్ (Salar) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీకి ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. 2023 డిసెంబరులో రీలీజైన బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ ముగిసేవరకు వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 624. 4 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
ఆదిపురుష్ (Adipurush) వంటి సినిమాతో నిరాశ చెందిన రెబల్ స్టార్ సలార్‌తో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించి మెప్పించింది. అలాగే కేజీఎఫ్ (KGF) వంటి మూవీలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్ (Prashant Neel) సలార్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటుడు, దర్శకుడు, నిర్మాత పృథ్వీరాజ్ (Prithviraj) సలార్ -2 గురించి మాట్లాడాడు. షూటింగ్ ప్రారంభంపై ప్రశ్న ఎదురవ్వగా పృథ్వీరాజ్ ఇలా బదులిచ్చాడు. ఫస్ట్ ఎన్టీఆర్ మూవీని ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేయాలని చెప్పారు. అలాగే నేను కూడా నా కమిట్మెంట్లు పూర్తి చేయాలని వెల్లడించాడు.
వీటితో పాటుగా.. రెబల్ స్టార్ స్పిరిట్ (Spirit) చిత్రం కంప్లీట్ చేయాలని, ఇక ఆ తర్వాత సలార్ 2 చిత్రీకరణ ప్రారంభమవుతుందని.. షూటింగ్‌లో కలుద్దామంటూ చెప్పుకొచ్చాడు. పృథ్వీరాజ్ దర్శకత్వంలో.. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ మార్చి 27న విడుదల అవ్వనుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పృథ్వీరాజ్ వెల్లడించారు.
Read More..
జపాన్‌లో ఎన్టీఆర్ మ్యానియా.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న వీడియో