- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ నెల 26న కలెక్టరేట్ ముందు ధర్నా.. ఎందుకంటే..?
by Naveena |

X
దిశ, తుంగతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈనెల 26న సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టినట్లు సిపిఎం పార్టీ తుంగతుర్తి మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ప్రజా సమస్యలపై జరిగిన ఇంటింట సర్వే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. గ్రామాలలో ప్రజలు ప్రభుత్వం ఇచ్చే హామీల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి జాజిగాల ముత్తయ్య,గోవిందాచారి,నాగయ్య,చంద్రయ్య,ముత్తయ్య, యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.
Next Story