- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పండుగకు ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

దిశ, రామాయంపేట : ఉగాదికి ఆటోలో ఇంటికి వస్తున్న వ్యక్తి ఆటో కు అటవీ పంది అడ్డు రావడంతో ఆటో బోల్తా పడి అక్కడిక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన సుతార్ పల్లి శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా మల్లుపల్లి కి చెందిన భాను చందర్(21) హైదరాబాద్ లో అద్దెకు ఆటో తీసుకొని నడుపుతుంటాడు. ఆటోలో సుతార్ పల్లి కి వస్తుండగా మార్గమధ్యలో ఆటోకి అడవి పంది అడ్డు రావడంతో దాన్ని ఢీకొట్టిన ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన భాను చందర్ ఘటనా స్థలంలోనే పడి ఉన్నాడు. ఉదయం వ్యవసాయ పొలాలు వేళ్లే రైతులు గమనించి 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది భాను చందర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి వివరాలు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. సుతార్ పల్లిలో ఉన్న తల్లిని సొంత గ్రామానికి తీసుకు వెళ్లేందుకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.