- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రైన్ నుంచి దూకిన యువతికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స.. పరామర్శించిన మాజీ మంత్రులు

దిశ, సికింద్రాబాద్: వేధింపులకు భయపడి కదులుతున్న ట్రైన్ నుంచి దూకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని రైల్వే ఎస్పీ చందనా దీప్తి తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి లు పరామర్శించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వ నిఘా వైఫల్యమే ఇలాంటి వాటికి కారణం అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళా కోచ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. అనువల్ రిపోర్ట్ సమయంలో క్రైమ్ రేట్ పెరిగిందని పోలీసులే చెప్పడం బాధాకరం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చూడాలన్నారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల పట్ల చిన్న చూపు ఉందన్నారు. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఫలితం లేదన్నారు. దేశంలోనే అతిపెద్ద కామండ్ కంట్రోల్ ఉన్న మన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు. బాధితురాలికి సూపర్ స్పెషాలిటీ తరహాలో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నిందితున్ని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని రైల్వే పోలీసులకు సూచించారు.
నిందితున్ని త్వరలోనే పట్టుకుంటాం : రైల్వే ఎస్పీ చందనా దీప్తి
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో మహిళా బోగిలో యువతి ఒక్కతే ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఒక యువకుడు ఆ యువతిని సెక్సువల్ హరాస్మెంట్ కు పాల్పడ్డాడని చెప్పారు. తనని రేప్ చేస్తాడనే భయంతో యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఆ యువకుడు ఎక్కడ రైలు ఎక్కాడో స్పష్టంగా బాదితురాలు చెప్పలేకపోతుందన్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నాం. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని చెప్పారు.నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. యువతి ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉందని, అతి కష్టం మీద ఆమెను మాట్లాడించి వివరాలు సేకరించడం జరిగిందన్నారు.
యువతి ఆరోగ్యం నిలకడగానే ఉంది: గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్
యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకు వచ్చిన సమయంలో యువతి స్పృహలో ఉన్నప్పటికీ కొంచెం మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపించిందన్నారు. వెంటనే అత్యవసర విభాగంలో చేర్చుకొని అవసరమైన చికిత్సలు అందించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చిన్న శస్త్ర చికిత్సలు చేస్తున్నామన్నారు.