ఎంఎంటీఎస్‌లో అత్యాచారయత్నం ఘటన.. సంచలన విషయాలు వెల్లడించిన రైల్వే ఎస్పీ

by Ramesh Goud |
ఎంఎంటీఎస్‌లో అత్యాచారయత్నం ఘటన..  సంచలన విషయాలు వెల్లడించిన రైల్వే ఎస్పీ
X

దిశ, వెబ్ డెస్క్: ఎంఎంటీఎస్ రైలు అత్యాచారయత్నం ఘటనలో గాయపడిన బాధితురాలిని రైల్వే పోలీస్ ఎస్పీ చందన దీప్తి (Railway Police Sp Chandana Deepthi) పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 26 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యువతి ఎంఎంటీఎస్ ట్రైన్ (MMTS Train) లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ (Secunderabad To Medchal) వెళుతున్నారని, లేడీస్ కంపార్ట్‌మెంట్ లో ఉన్న తనతో పాలు మరో ఇద్దరు మహిళలు ఉన్నారని, అల్వాల్ (Alwal) స్టేషన్ ప్రాంతంలో వారు దిగిపోయినట్లు తెలిపారు. అదే కంపార్డ్ మెంట్ లో ఉన్న మరో వ్యక్తి బాధిత యువతి వద్దకు వచ్చి గట్టిగా పట్టుకున్నాడని యువతి చెప్పినట్లు తెలిపారు.

అతడు ఆ యువతితో తన రూంకి రావాలని అడిగినట్లు చెప్పిందని, ఒప్పుకుంటే వదిలేస్తాడేమోనని సరే అని కూడా చెప్పానని చెప్పింది. బాధితురాలు ఆ వ్యక్తి తనని వదిలిపెట్టడేమో.. ఏమైనా చేస్తాడేమోనని భయంతో ట్రైన్ లో నుంచి దూకేసినట్లు తెలిపిందని ఎస్పీ (SP) అన్నారు. దూకేసిన తర్వాత స్పృహ కోల్పోయానని, ఆసుపత్రికి వచ్చాక స్పృహలోకి వచ్చానట్లు చెప్పిందని తెలిపారు. బాధితురాలు నిందితుడిని గుర్తు పట్టలేనని చెబుతుందని, కానీ అతడు ట్రైన్ ఎక్కిన ప్రాంతం గుర్తుందని చెప్పినట్లు తెలిపారు. దీని ప్రకారంగా విచారణను ముమ్మరం చేశామని చెప్పారు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని అన్నారు. నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా నిన్న రాత్రి ఓ మహిళ ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి (Rape Attempt) పాల్పడ్డాడు. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి దూకేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన మహిళను గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital)లో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు.

Next Story

Most Viewed