- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శారదా పీఠానికి బిగ్ షాక్.. వారంలోపు తొలగించాలని నోటీసులు

దిశ, వెబ్ డెస్క్: విశాఖ చినముషిడివాడ(Visakhapatnam Chinamushidivada)లోని శారదా పీఠానికి(Sharada Peetham) బిగ్ షాక్ తగిలింది. పీఠం కట్టడాలను తొలగిలించాలని జీవీఎంసీ(GVMC) నోటీసులు జారీ చేసింది. వారం వరకూ చూస్తామని లేనిపక్షంలో తామే తొలగిస్తామని పేర్కొంది. అంతేకాదు తొలగింపునకు అయ్యే ఖర్చును శారదాపీఠం నుంచి వసూలు చేస్తామని వెల్లడించింది.
కాగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడి వాడలో శారదాపీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూముల అనుమతులు ఇప్పటికే కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వైసీపీ హయాంలో విశాఖ శారదాపీఠం ఇష్టారాజ్యంగా భూములను ఆక్రమించిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే నెం.90లో ఉన్న రహదారి భూమిని ఆక్రమించిందని, అది ప్రభుత్వ భూమి అని, అందులో నిర్మాణాలు చేసినట్లు జీవీఎంసీ సైతం గుర్తించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆక్రమించుకున్న రహదారి భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో, అక్రమ నిర్మాణాలను ఎందుకు జప్తు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో జీవీఎంసీ పేర్కొంది.