- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెట్టింగ్ అకౌంట్లు హోల్డ్.. ఆందోళనలో ఖాతాదారులు

దిశ, మంగపేట : మండలంలోని నాలుగు జాతీయ బ్యాంకులలోని సైబర్ నేరగాళ్లకు చెందిన సుమారు వందకు పైగా బ్యాంకు ఖాతాలను అధికారులు హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. కమలాపురంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మంగపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మల్లూరులోని ఏపీజీవీబీ, రాజుపేటలోని కెనరా బ్యాంకుల పరిధిలో ఈ ఖాతాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు సైబర్ నేరగాలు దేశ వ్యాప్తంగా సెల్ ఫోన్లకు కంపెనీల, ఆర్థిక లావాదేవీలకు సంబందించి బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి మాట్లాడుతూ ఓటీపీలు తెలుసుకోని సైబర్ నేరాలకు పాల్పడుతుండటంతో లక్షల్లో డబ్బులుల పోగొట్టుకున్న ఖాతాదారులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సైబర్ నేరగాళ్లు మండలం లో సుమారు వందకు పైగా ఉండి అలాంటి ఖాతాలు సైబర్ క్రైమ్ సెంట్రల్ వైజ్డ్ ఐటీ సెల్ ఫిర్యాదు మేరకు వాటిని గుర్తించి ఖాతాలను సీజ్ చేయడం మండలంలో సంచలనం కలిగించింది.
మండలంలోని సైబర్ నేరగాళ్ల ఖాతాలు సీజ్ కావడంతో మండలంలోని ఓ జాతీయ బ్యాంకుకు ఖాతాదారులు సోమవారం రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల కింద సీజ్ అయిన ఖాతాదారులు తమ ఖాతాల్లో ప్రభుత్వం వేసిన రైతుబంధు, పీఎం కిసాన్ యోజన డబ్బులు డ్రా చేయడానికి వచ్చి సీజ్ విషయాన్ని మేనేజర్ దృష్టికి తేవడంతో ఖాతాలను పరిశీలించిన మేనేజర్ ఖాతాలు సెంట్రల్ వైజ్డ్ ఐటీ సెల్ కంప్లైంట్ మేరకు సీజ్ అయ్యాయని చెప్పి మిగతా విషయాలు జిల్లా కేంద్రంలోని సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని చెప్పినట్లు తెలిసింది. మండలం లో వెలుగులోకి వచ్చిన సైబర్ క్రైం నేరగాళ్ల గురించి ఆ నోటా ఈ నోటా తెలియడంతో మండల ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ విషయమై పలువురు మేనేజర్లను దిశ సంప్రదించగా నిజమేనని తెలిపారు.