- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News : మండుతున్న ఎండలు... విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎండలు తీవ్రం(Summer Heat) అవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వేసవి తీవ్రత, నీటి ఎద్దడిపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పలు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఇకపై వాటర్ బెల్(Water Bell) తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. అదే విధంగా ఉపాధిహామీ కూలీలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలని కలెక్టర్లకు తెలియజేశారు. మున్సిపల్ కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల్లోపు పనులు అప్పగించవద్దని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి సమస్యల పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు ఎండ తీవ్రత, హీట్ వేవ్స్ కు సంబంధించి మొబైల్ అలర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చలి వేంద్రాల్లో మజ్జిగ, తాగు నీటి పంపిణీ నిరంతరం జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.