విడాకులు తీసుకున్న హీరోతో ప్రియాంక మోహన్ ఎంగేజ్‌మెంట్..? నెట్టింట సంచలనం సృష్టిస్తున్న ఫొటో

by Hamsa |
విడాకులు తీసుకున్న హీరోతో ప్రియాంక మోహన్ ఎంగేజ్‌మెంట్..? నెట్టింట సంచలనం సృష్టిస్తున్న ఫొటో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భార్య తనకు తెలియకుండా ఎలా డైవర్స్ ఇస్తారని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడంతో వీరిద్దరి విడాకుల ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో జయం రవి ఓ సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వైరల్ కావడంతో ఆమె రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చింది.

ఇప్పుడు జయం రవి, ప్రియాంక ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, వీరిద్దరూ దండలతో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కానీ అది ఓ సినిమాకు సంబంధించినదని తెలుస్తోంది. జయం రవి, ప్రియాంకా జంటగా ‘బ్రదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది.

‘బ్రదర్’ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో హీరో, హీరోయిన్‌ను ఇలా పూల మాలలతో సన్మానించారు. అదే స్టిల్, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో జయం రవి, ప్రియాంక మోహన్‌ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ ఇద్దరూ రహస్యంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు పుట్టిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

Next Story

Most Viewed