- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
7/g brundavan colony :7/G బృందావన కాలని-2పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
దిశ, సినిమా: సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న లవ్ స్టోరీస్(Love stories)లో ‘7/G బృందావన కాలని’ ఒకటి. రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్ (Sonia Aggarwal) జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. దీంతో 90s కిడ్స్ ఫెవరెట్ సినిమాల్లో ‘7/G బృందావన కాలని’ ఒకటిగా చేరిపోయింది. సెల్వ రాఘవన్ (Selva Raghavan) దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్‌గా రీ రిలీజై కూడా బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) అయింది. అలాంటి ఈ చిత్రం సీక్వెల్ రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.
కానీ, న్యూ ఇయర్ స్పెషల్‌గా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ మూవీకి సీక్వెల్ రాబోతున్నట్లు అనౌన్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్ (First look) పోస్టర్ రిలీజ్ చేశారు. చుట్టూ ఎత్తైన భవనాలు ఉండగా వాటి మధ్య ఓ జంట బ్యాగులు పట్టుకని నడుస్తూ కనిపించారు. ఇందులో వారి ఫేస్‌లు రివీల్ చేయలేదు కానీ పోస్టర్‌పై మాత్రం ‘7/G బృందావన కాలని-2’ టైటిల్ మాత్రం ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా.. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. యూత్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.