- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెళ్లి తర్వాత భర్తతో అక్కడికి వెళ్లిన కీర్తి సురేష్.. లాస్ట్ వరకు చూడండంటూ షాకింగ్ పోస్ట్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. అయితే మ్యారేజ్ తర్వాత ఈ భామ హనీమూన్‌కి వెళ్లకుండా తాను నటించిన ‘బేబీ జాన్’ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉండిపోయింది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక మ్యారేజ్ తర్వాత సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండేసరికి ఇప్పుడు కీర్తి సురేష్.. ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి భర్తతో ఎంజాయ్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా కీర్తి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన భర్తతో హనీమూన్‌కి పుకెట్ వెళ్లినట్లు పలు ఫొటోలు షేర్ చేసింది. అలాగే ‘కవర్ అనేది వాస్తవానికి ఏం జరిగిందో దాన్ని కప్పివేస్తుంది. నిజమైన నన్ను చూడటానికి ఫొటోస్ అన్ని చివరి వరకు స్వైప్ చేయండి’ అనే క్యాప్షన్ జోడించింది. ఇక లాస్ట్ వరకు చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు థర్మామీటర్ నోట్లో పెట్టుకొని కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కీర్తికి ఫీవర్ త్వరగా తగ్గిపోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అమ్మడు పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.