- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫైనల్లీ అందరు అనుకున్నంత పని చేయబోతున్న సమంత.. షాక్‌లో ఫ్యాన్స్?
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత గురించి సుపరిచితమే. అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందం, నటన, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక నాగచైతన్యతో ప్రేమలో పడి.. వివాహం చేసుకుని, నాలుగేళ్లు గడవకముందే డివోర్స్ తీసుకుంది. ఈ కారణంగా సామ్ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంది. ఇక ఈ అమ్మడు మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం సమంత పలు దేశాల్లో ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటుంది. ఈ వ్యాధితో బాధపడుతూనే ‘శాకుంతలం’ సినిమాలో నటించింది.
కానీ ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్ర షూటింగ్ అనంతరం సామ్ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట వార్తలు వినిపించాయి. ఇక ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో సామ్ పేరు ఎక్కడ వినిపించట్లేదు.. కనిపించట్లేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేకపోవడంతో జనాలకు రకరకాల డౌట్లు వస్తున్నాయి. మొన్నటి వరకు ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన నెటిజన్లు సామ్ కనిపించకపోవడంతో.. అసలు సమంత ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఎవరూ ఆమెను పట్టించుకోవడమే మానేశారు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలోని టాక్ ప్రకారం.. సమంత వద్దకు పలు స్టార్ దర్శకులు వచ్చి మంచి కథలు వివరించారట. కానీ సామ్ రిజెక్ట్ చేస్తూ వచ్చిందట. దీంతో ఫ్యాన్స్‌కు సమంత అసలు సినిమాలు చేస్తుందా? లేదా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఫైనల్లీ నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలనే నిజం చేయబోతుందిగా? ఇకపై సినిమా ఇండస్ట్రీలో కనింపించకూడదంటూ డిసైడ్ అయ్యిందట? అంటూ ఓ న్యూస్ తెగ ప్రచారం జరుగుతుంది.
- Tags
- Samantha