- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
క్యాన్సర్‌తో పోరాడుతున్న నటికి రక్షణ కవచంలా మారిన ప్రియుడు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (పోస్ట్)
దిశ, సినిమా: నటి హీనాఖాన్(Hina Khan) గత కొద్ది రోజుల నుంచి క్యాన్సర్(Cancer)తో పోరాడుతున్న విషయం తెలిసిందే. నిత్యం తన చికిత్స గురించి తెలుపుతూ పోస్టులు పెడుతూ ఉంటుంది. తాజాగా, ఆమె తన భాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నాకు తెలిసిన ఉత్తమ మానవుడు ఇతనే. రాఖీ జైస్వాల్(Rakhi Jaiswal) నా జీవిత భాగస్వామిగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను క్యాన్సర్ ట్రీట్‌మెంట్(Cancer treatment)లో భాగంగా గుండు చేయించుకుంటే అతను కూడా హెయిర్ తీసేశాడు. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడే తన జుట్టు పెరగనిస్తానన్నాడు.
నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వంద కారణాలు చెప్పి వెళ్లిపోయే అవకాశం ఉన్నా కానీ నాతోనే ఉంటూ నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. మేమిద్దరం సంతోషకర, బాధాకర సందర్భాల్లో కలిసున్నాం. మా తండ్రులను కోల్పోయినప్పుడు ఇద్దరం చాలా ఏడ్చాం. కరోనా సమయంలో కూడా కలిసే ఉన్నాం. నాకు కోవిడ్(Covid) వస్తే మూడు మాస్కులు ధరించి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నా చేయి వదల్లేదు. అన్నీ వదిలేసి నాతోనే ఉంటున్నాడు. కీమో థెరపీ(Chemotherapy) ప్రారంభించినప్పటి నుంచి నా బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు.
నాకు డ్రెస్సింగ్ (Dressing)చేయడం తినిపించడం వంటివి చూసుకుంటున్నాడు. నా చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టించాడు. రాఖీ నువ్వు ఓ అద్భుతం. దేవుడు పంపిన ఆశీర్వాదం అని హాస్పిటల్ సిబ్బంది చెప్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తి ప్రతి అమ్మాయి జీవితంలో ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. అలాగే తన కాళ్లు పట్టుకుని మరీ ప్రియుడు సేవలు చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఇక అది చూసిన వారంతా అమ్మాయిలో ఏ లోపం లేకున్నా వదిలించుకునే ఈ రోజుల్లో ఇలా చేయడం గ్రేట్ అని రాఖీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.