- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Allu Arjun: స్పోక్స్ పర్సన్ ని పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న అల్లు అర్జున్

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోలు సరికొత్త నిర్ణయాలు తీసుకుని టాక్ ఆఫ్‌ది మీడియాగా నిలుస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న స్టార్లు.. తమ సక్సెస్ రేటును ఎక్కువ పెంచుకునేందుకు కొత్త ట్రెండ్ ను సెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కొందరైతే దీనిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పుష్ప-2 తో పెద్ద విజయం సాధించిన అల్లు అర్జున్ రూ. 2 వేల కోట్ల కలెక్షన్ క్లబ్‌లోకి చేరాడు. ముందు ముందు తన మార్కెట్ ను పెంచుకునేందుకు రూట్ మార్చినట్టు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ( Allu Arjun ) సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి ఒక రోజు జైలులో ఉన్న విషయం మనకీ తెలిసిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని వలన బన్నీకి క్రేజ్ బాగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాసెస్‌లో తన వర్క్స్ అన్ని చూసుకోవడానికి స్పెషల్ స్పోక్ పర్సన్‌ను పెట్టుకునే పనిలో బన్నీ ఉన్నారట.
మనం ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దగ్గర స్పోక్ పర్సన్స్‌ను చూశాం. కానీ, ఇప్పుడు మొదటి సారి ఓ హీరోకి స్పోక్స్ పర్సన్ ( Spokesperson) ఉండటం త్వరలో చూడబోతున్నామట. ఇక ముందు అల్లుఅర్జున్ ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో.. అన్నీ ఆ స్పోక్ పర్సనే చూసుకుంటాడని అంటున్నారు.
అల్లుఅర్జున్ ఎవరినైనా కలవాలన్నా.. ఏదైనా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నా ఆ స్పోక్ పర్సన్ వలనే జరుగుతాయట. త్వరలో త్రివిక్రమ్‌తో కొత్త సినిమా చేయబోతున్నాడు బన్నీ . ఆ తర్వాత పుష్ప-3 చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇలా తర్వాత చేసే అన్ని సినిమాల ప్రాజెక్టులు ఆయన ఈవెంట్స్, ఆయన వెర్షన్ ఏంటో అనేది మొత్తం ఆ స్పోక్స్ పర్సన్ చూసుకోనున్నాడట. మరి, దీనిలో ఎంత నిజముందో అల్లు కాంపౌండ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.