- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
All The Best Tarak.. మా ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుంది.. పవన్ కళ్యాణ్(ట్వీట్)
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘దేవర’(Devara). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnavi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. అయితే భారీ బడ్జెట్ సినిమా, స్టార్ హీరో సినిమా కావడంతో దేవరకు టికెట్ రేట్ల పెంపు, ఎక్స్ ట్రా షోల కోసం ఏపీ ప్రభుత్వాన్ని అడగ్గానే వెంటనే పర్మిషన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేవర సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, హీరో ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి, సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కందుల దుర్గేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటిసారి ఓ హీరో టికెట్ రేట్ల పెంపుకు థ్యాంక్స్ చెప్తూ పవన్ కళ్యాణ్‌కి, సీఎం చంద్రబాబు(Chandrababu)కు ట్వీట్ చేయటంతో ఆ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్‌కి రిప్లై ఇవ్వడం గమనార్హం.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. “మీ సినిమాకు బెస్ట్ విషెస్ తారక్ గారు. మా NDA ప్రభుత్వం ఏపీలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగు సినీ పరిశ్రమ(Telugu Film Industry) కోసం నిలబడతాం, కావలిసినవి చేస్తాం” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా ఇద్దరు హీరోలు ట్వీట్స్ చేసుకోవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.