- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో మళ్లీ నడుస్తానో లేదో : క్రిస్ కెయిర్న్స్
దిశ, స్పోర్ట్స్: జీవితంలో తాను తిరిగి నడుస్తానో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇలా బతికి ఉన్నానంటే మాత్రం చాలా అదృష్టవంతుడినే అని న్యూజీలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్ అన్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఈ ఏడాది అగస్టులో అరుదైన గుండె వ్యాది కారణంగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. అయితే అగస్టులో ఆయనకు నాలుగు బైపాస్ సర్జరీలు చేశారు. అయితే నాలుగో సర్జరీ సమయంలో వెన్నుపూసలో స్ట్రోక్ వచ్చి నడుము కింది భాగం మొత్తం చచ్చుబడి పోయింది. ఆస్ట్రేలియాలోని వైద్యులు అతడిని చాలా శ్రమపడి బతికించారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి నాలుగు నెలలు అవుతు్నది. అప్పటి నుంచి కెయిర్న్స్ యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రా హాస్పిటల్‌లో కోలుకుంటున్నాడు.
వైద్యులు అతడిని కంటికి రెప్పలా కాపాడుతూ కోలుకునేలా సహాయ పడుతున్నారు. తాజాగా ఆయన న్యూజీలాండ్‌కు చెందిన ఒక వెబ్‌సైట్‌తో మాట్లాడారు. నేను జీవితంలో తిరిగి నడుస్తానో లేదో తెలియదు కానీ నేను బతికి ఉన్నాను. అది నాకు చాలు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నదని అన్నాడు. నేను ఇకపై వీల్ చైర్‌లోనే జీవిత మంతా గడపాలి. అయితే ఆ జీవితం ఎలా ఉంటుందో తొలి సారి చూడబోతున్నాను. ఎలా ఉన్నాసరే మిగిలిన లైఫ్‌ను ఆనందంగా గడపాలని అనుకుంటున్నట్లు కెయిర్న్స్ చెప్పాడు. కాగా, క్రిస్ కెయిర్న్స్ న్యూజీలాండ్ తరపున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు.