- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా బాధితులకు మేమున్నాం.. చిట్యాల పోలీసుల దాతృత్వం
దిశ, చిట్యాల: కరోనా రోగులకు భోజనవసతి కల్పించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. లాఠీలు చేత పట్టి కఠినంగా వ్యవహరించడం మాత్రమే కాదని, తమలో కూడా మానవత్వం ఉంటుందని చిట్యాల పోలీసులు నిరూపించారు. చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు లాక్‌డౌన్ ముగిసేవరకు గుంటూరుపల్లి గ్రామానికి చెందిన శాకమూరి అమర్ భోజన వసతిని కల్పిస్తున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు.ఈ మేరకు స్థానిక ఆస్పత్రిలో భోజనాలను పోలీస్, ఆసుపత్రి సిబ్బందితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. లాక్‌డౌన్ వల్ల కరోనా పేషెంట్‌లకు వారి కుటుంబ సభ్యులకు బయట భోజనాలు దొరకడం లేదని, వారికి పోలీస్ శాఖ సహకారంతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్ ప్రసన్, పోలీస్, ఆసుపత్రి సిబ్బంది శంకర్, కమలాకర్, నరేందర్, కిరణ్ పాల్గొన్నారు.