- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరుకు కరోనా పాజిటివ్
దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్ టెస్ట్ చేయించుకున్న తనకు రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కానీ తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని .. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యానని తెలిపారు. గత నాలుగు, ఐదు రోజులుగా తనను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవలసిందిగా కోరారు. ఎప్పటికిప్పుడు తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తానని చెప్పారు. కాగా చిరుకు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అన్నా నువ్వు చిరంజీవివి.. నీకేమీ కాదు..చిరు నవ్వుతో ఆరోగ్యంగా తిరిగివస్తావ్ అని చెప్తున్నారు.
కాగా రెండు రోజుల క్రితమే చిరు, నాగ్ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఒకవేళ నాగ్‌కు కరోనా పాజిటివ్ తేలితే బిగ్ బాస్‌కు మరో హోస్ట్‌ను ఎంచుకోవాల్సిందే. ఇక ఆదివారం కూడా ఎంపీ సంతోష్, రామ్ చరణ్ తేజ్‌లతో కలిసి మొక్కలు కూడా నాటారు చిరు.