- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్లాక్ ఫంగస్ డేంజర్ బెల్స్: ఏపీలో మరో ప్రాణం బలి
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దీని బారిన పడి మరణించేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారిన పడి పలువురు మృత్యువాత పడగా.. తాజాగా మరోకరు ప్రాణాలు కోల్పోయారు.
కృష్ణా జిల్లా నున్నకు చెందిన చింతా వెంకటేశ్వరరావు అనే వృద్ధుడు బ్లాక్ ఫంగస్‌తో మరణించాడు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా.. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందాడు. కరోనా లక్షణాలు తగ్గిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో చికిత్స కోసం ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు బంధువుల తరలించారు.
పరీక్షలు చేసిన వైద్యులు బ్లాక్ ఫంగస్ సోకినట్లు నిర్ధారించి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో చింతా వెంకటేశ్వరావు మరణించాడు. అయితే బ్లాక్ ఫంగస్‌కు వినియోగించే ఇంజెక్షన్ ఎక్కడా దొరకలేదని, దాని వల్లే మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.