విషం చిమ్ముతున్న డ్రాగన్ కంట్రీ !

by vinod kumar |
విషం చిమ్ముతున్న డ్రాగన్ కంట్రీ !
X

దిశ, వెబ్‌డెస్క్: ఓవైపు సుతిమెత్తగా చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు డ్రాగన్ కంట్రీ విషం చిమ్ముతోంది. 4నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా బలగాలు తాజాగా చుశూల్ సెక్టార్‌లో సరిహద్దులను చెరిపేందుకు బరితెగించాయి. అటు ఈ వివాదం కొనసాగుతుండగానే కైలాస మానసరోవరం దగ్గర సైనిక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన ఆప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టిన చైనా.. మిస్సైల్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసినట్లు బయట పడింది. అంతేగాక ఆకాశంలో టార్గెట్లను ఛేదించగల మిస్సైల్స్‌ను మోహరించినట్లు సమాచారం. ఈనెల 29న అర్థరాత్రి జరిగిన సంఘటనలో సరిహద్దులు చెరిపేందుకు చైనా ప్రయత్నించగా భారత్ అడ్డుకుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దాంట్లో నిజం లేదని చైనా ప్రకటించింది.

Next Story

Most Viewed