- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాటింగ్ ఎంచుకున్న ధోని
దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఉత్కంఠపోరు మొదలు కానుంది. ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ చెన్నైకి డిసైడర్ మ్యాచ్ కావడం, ప్రత్యర్థి జట్టు టఫ్‌గా ఉండడం ధోనికి సవాల్‌గా మారింది. ఢిల్లీని ఓడిస్తేనే చెన్నై ప్లే అఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
జట్ల బలాబలాలు..
శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ఢిల్లీ ఈ సీజన్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటికే 8 మ్యాచులు ఆడిన క్యాపిటల్స్ 6 మ్యాచుల్లో విక్టరీ కొట్టింది. కేవలం 2 మ్యాచుల్లోనే ఓటమి పాలైంది. బ్యాటింగ్ విషయానికొస్తే.. పృథ్వీ షా, శిఖర్ దావన్, శ్రేయాస్ అయ్యర్, పంత్/అజింక్య రహనే, మార్య్సుస్ స్టోయినిస్, అలెక్స్ కారీ/ షిమ్రాన్ హెట్మేయర్‌తో బలంగా కనిపిస్తోంది. ఈ ఆటగాళ్లు ఒకరికి ఒకరూ పోటీగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే కగిసో రబాడా ఈ సీజన్ ఏకంగా 18 వికెట్లు తీసుకొని పర్పుల్ క్యాప్ సాధించాడు. ఇక ఎన్రిచ్ నార్ట్జే కూడా 10 వికెట్లు తీసుకొని మంచి ఎకానమిలో ఉన్నాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్ రాణిస్తున్నారు.
ఇక చివరి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఫేవరేట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే 8 మ్యాచులు ఆడిన సీఎస్కే కేవలం 3 మ్యాచుల్లోనే గెలుపొందింది. మిగతా 5 మ్యాచులో ఘోర పరాజయం చవిచూసింది. బ్యాటింగ్ విషయానికొస్తే.. షేన్ వాట్సన్, డు ప్లెసిస్, అంబటి రాయుడితో బలంగా కనిపించిన ఈ ఆటగాళ్లు చేతులెత్తేస్తే చెన్నై జట్టును ధోని కూడా ఆదుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా మిడిలార్డర్ పూర్తిగా విఫలం అవుతోంది. దీంతో చెన్నై జట్టుకు ఓటమి తప్పడం లేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే అంతంత మాత్రనే ఉంది. కీలక బౌలర్లు ఉన్నప్పటికీ వికెట్లు తీయడం, పరుగులు కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారు. ఇక ఈమ్యాచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన స్కోరు ఎంత నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందే.