ఢిల్లీ ముందు డాషింగ్ స్కోరు @ 180

by Shyam |
ఢిల్లీ ముందు డాషింగ్ స్కోరు @ 180
X

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత తడబడ్డా చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇందులో చివరి రెండు ఓవర్లలోనే 32 పరుగులు రావడం గమనార్హం.

ఇన్నింగ్స్ సాగిందిలా…

తొలుత ఓపెనింగ్ వచ్చిన శామ్‌ కుర్రాన్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో సీఎస్కే కాస్త నిరుత్సాహానికి గురైంది. ఇక మరో ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్, వన్ డౌన్ ప్లేయర్ షేన్ వాట్సన్ కాసేపు క్రీజులో కుదురుకున్నారు. ముఖ్యంగా డుప్లెసిస్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. షేన్ వాట్సన్ (36) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డుప్లెసిస్ కూడా రబాడా వేసిన బంతికి షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 109 పరుగులకు సీఎస్కే టాప్‌ ఆర్డన్‌ను కోల్పోయింది.

ఇక మిడిలార్డర్‌లో అంబటి రాయుడు కుదురుకున్నా.. ధోని మాత్రం 129 పరుగుల వద్ద కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జడేజా… అంబటి రాయుడికి మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. అంబటి రాయుడు 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు కొట్టి 45 పరుగులు చేయగా.. జడేజా 13 బంతుల్లోనే 4 సిక్సర్లు కొట్టి 33 రన్స్ తీశాడు. వీరిద్దరు చివరి వరకు నాటౌట్‌గా నిలవడంతో చెన్నై స్కోరు 179కు చేరింది.

స్కోరుబోర్డు:

Chennai Super Kings Innings 179-4 (20 Ov)

1. శామ్ కుర్రాన్ c నోర్ట్జే b తుషార్ దేశ్ పాండే 0(3)
2. ఫాఫ్ డు ప్లెసిస్ c దావన్ b రబాడా 58(47)
3. షేన్ వాట్సన్ b నోర్ట్జే 36(28)
4. అంబటి రాయుడు నాటౌట్ 45(25)
5. ఎంస్ ధోని (c) (wk)c అలెక్స్ కారీ b నోర్ట్జే 3(5)
6. రవీంద్ర జడేజా నాటౌట్ 33(13)

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 179/4

వికెట్ల పతనం: 0-1 (శామ్ కుర్రాన్, 0.3), 87-2 (షేన్ వాట్సన్, 11.4), 109-3 (ఫాఫ్ డు ప్లెసిస్, 14.4), 129-4 (ఎంస్ ధోని, 16.3)

బౌలింగ్:

1. తుషార్ దేశ్‌పాండే 4-0-39-1
2. కగిసో రబాడా 4-1-33-1
3. అక్సర్ పటేల్ 4-0-23-0
4. ఎన్రిచ్ నోర్ట్జే 4-0-44-2
5. రవిచంద్ర అశ్విన్ 3-0-30-0
6. మార్క్యుస్ స్టోయినిస్ 1-0-10-0

Advertisement

Next Story

Most Viewed