- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్కువ ధరకే సెల్‌ఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం..
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : తక్కువ ధరకు సెల్ ఫోన్లు ఇప్పిస్తానని రూ 5 లక్షల మోసానికి పాల్పడిన పాత నేరస్థుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం రాంకోఠి లో నివాసముండే దివేష్ గుప్తాకు తెలిసిన వారి ద్వారా అమన్ జోషి (29) పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో దివేష్ గుప్తాను మోసం చేయాలనే ఉద్ధేశ్యంతో తక్కువ ధరకు ఫోన్లను ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మిన దివేష్ సుమారు మూడు నెలల క్రితం రూ 5 లక్షలను అమన్ జోషికి ఇచ్చాడు. నాటి నుండి ఈ రోజు, రేపు అంటూ ఫోన్లు ఇవ్వకుండా వాయిదా వేస్తుండడంతో ఇటీవల తనకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయగా అమన్ జోషి ఫోన్ స్విచ్చాఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన దివేష్ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు బేగంబజార్‌లో ఉన్నట్లు అందిన సమచారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే నగరంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.