పౌరసత్వ దరఖాస్తులకు కేంద్రం ఆహ్వానం

by Shamantha N |
CAA Act
X

న్యూఢిల్లీ: గుజరాత్, రాజస్తా్న్, ఛత్తీస్‌గడ్, హర్యానా, పంజాబ్‌లలోని 13 జిల్లాల్లో నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లకు చెందిన శరణార్థులు భారత దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవానలి కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుజరాత్‌లోని మోర్బీ, రాజ్‌కోట్, పటాన్, వడోదర, ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్, బలోదబజార్, రాజస్తాన్‌లోని జలోర్, ఉదయ్‌పూర్, పాలి, బర్మార్, సిరోహి, హర్యానాలోని ఫరీదాబాద్, పంజాబ్‌లోని జలంధర్‌లలో నివసిస్తున్న శరణార్థులకు మాత్రమే వర్తిస్తుందని వివరించింది. వీరికి సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం) కింద కాకుండా పౌరసత్వ చట్టం, 1955, 2009లో రూపొందించిన రూల్స్ ఆధారంగా సిటిజన్‌షిప్ అందించనున్నట్టు తెలిపింది. ఎందుకంటే సీఏఏ కింద ఇంకా నిబంధనలు రూపొందించాల్సి ఉన్నది.

Advertisement

Next Story