తెలంగాణ నిరుద్యోగులు అలర్ట్.. OTR ఎడిట్ కు TSPSC అనుమతి, కొత్తవారికీ ఛాన్స్

by Kavitha |   ( Updated:2022-03-28 08:57:10.0  )
తెలంగాణ నిరుద్యోగులు అలర్ట్.. OTR ఎడిట్ కు TSPSC అనుమతి, కొత్తవారికీ ఛాన్స్
X

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తొలి విడతలో భాగంగా 30వేల 453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

*నిరుద్యోగ అభ్యర్థుల కోసం ప్రవేశ పెట్టిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR)లో వ్యక్తిగత మార్పులు చేసుకునేందుకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

*అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in ను సంప్రదించి ఎడిట్ ఆప్షన్ ద్వారా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది.

*ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలుగా పునర్విభజన చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల స్థానికతను సవరించుకోవాలిని టీఎస్ పీఎస్సీ వెల్లడించింది.

*33 జిల్లాలు, రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు ఏర్పాటైనందున వాటి ప్రకారం అభ్యర్థులు స్థానికతను ఖరారు చేయాల్సి ఉంది.

*టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​ ఓపెన్​ చేసుకోగానే.. తమ రిజిస్ట్రేషన్​ వివరాలు నమోదుచేసిన తర్వాత ముందుగా స్థానికత వివరాలను సవరించుకోవాలి.

*టీఎస్​పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన ప్రాంతంతో పాటుగా ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా వివరాలు ఎడిట్​ చేయాల్సి ఉంది.

*అంతేకాకుండా గతంలో నాలుగేండ్ల కిందట నుంచి ఇప్పటి వరకు విద్యార్హతల్లో మార్పులను కూడా సవరించుకోవచ్చు.

*ఓటీఆర్​లో ఎడిట్​ చేయాలనుకుంటే వెబ్​సైట్​లో ఎడిట్​ ఓటీఆర్​ అనే దానిపై క్లిక్​ చేసి, టీఎస్​పీఎస్సీ ఐడీ, పెట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఫోన్​ నెంబర్​ ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తోంది. దాన్ని నమోదు చేస్తే రిజిస్ట్రేషన్​ ఎడిట్​ ఓపెన్​ అవుతోంది.

*ఎడిట్​ చేయాల్సిన వివరాలను కరెక్ట్​గా నమోదు చేసి, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాలను ఎంపిక చేసి, విద్యార్హతలను నమోదు చేయాలి. అనంతరం అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్​లోడ్​ చేస్తే కొత్త ఓటీఆర్​ జనరేట్​ అవుతోంది.

కొత్తవారికి ఛాన్స్:

*టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​ ఓపెన్​ చేయగానే న్యూ రిజిస్ట్రేషన్​ మీద క్లిక్​ చేసి, మొబైల్​ నెంబర్​ ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీని నమోదు చేయాలి.

*అప్లికేషన్​ ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ మెయిల్​ ఐడీ, 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన జిల్లాల వివరాలు, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి.

*అభ్యర్థి ఫొటో, సంతకం అప్​లోడ్​ చేయాల్సి ఉంటోంది. ఈ వివరాలన్నీ సబ్మిట్​ చేసిన తర్వాత టీఎస్​పీఎస్సీ ఐడీ క్రియెట్​ అవుతోంది. దాన్ని డౌన్లోడ్​ చేసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed