CIL Jobs: కోల్ ఇండియాలో జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-29 14:39:58.0  )
CIL Jobs: కోల్ ఇండియాలో జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, కోల్‌కతా(Kolkata)లోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ(Management Trainee) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://coalindia.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 28 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

  • మైనింగ్(Mining) - 263
  • మెకానికల్(Mechanical) - 104
  • ఎలక్ట్రికల్(Electrical) - 102
  • సివిల్(Civil) - 91
  • సిస్టమ్(System) - 41
  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(E&T) - 39

విద్యార్హత:

పోస్టును బట్టి 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌), బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్) పూర్తి చేసి ఉండాలి. అలాగే గేట్‌-2024 అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సెప్టెంబర్ 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

గేట్-2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ. 1180.. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ. 1,160,000 వరకు సాలరీ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed