- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కారు ఆటో ఢీ..ఆరుగురి మృతి
ఆటోను కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం బకింగ్ హం కెనాల్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే ఈత ముక్కల గ్రామం నుంచి వేగంగా వస్తున్న కారు బకింగ్ హం కెనాల్ వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మడనూరుకు చెందిన ఆటో డ్రైవర్ మేడికొండ బ్రహ్మయ్య (35), సాదు ప్రియాంక (27), బిల్లా శ్రీలత (32), పల్లెపాలెంకు చెందిన రసాని గోవిందమ్మ(35), రాజుపాలెం గ్రామానికి ఆత్మకూరి శ్రీను, దార్ల సుబ్బులు (50) హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.
TAGS ;car, auto accident, 6 members died, prakasam district, overspeed reason