- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్కు అభ్యర్థే కరువయ్యారు..
దిశ, హాలియా: అబద్ధాల ముఖ్యమంత్రికి రానున్న సాగర్ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు నాంది పలకాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ నుంచి బరిలో నిలిపేందుకు అభ్యర్థే కరువయ్యారని ఎద్దేవా చేశారు.
హంగులూ, ఆర్భాటాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. ఆయన కుటుంబంలో అందరికీ రాజకీయ ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్.. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక మాట.. తర్వాత మరో మాట చెప్పడం కేసీఆర్కే సాధ్యమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు కాకుండా.. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలన్నారు.
నిరుద్యోగులు, ఉద్యోగులు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాములు నాయక్కు ఓటు వేసి టీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, బెల్యానాయక్, కుందూరు రఘువీర్ రెడ్డి, కాకునూరి నారాయణ, తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.