శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ మృతి

by Shyam |
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ మృతి
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళా మరణించింది. ఎయిర్ పోర్టు అధికారుల కథనం ప్రకారం..కోల్‌కత్తాకు చెందిన జశోధ (58) కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారు. అయితే, ఆమె గత కొన్నేండ్లుగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి వెళ్లేందుకు అని జశోధను వీల్‌చైర్ ద్వారా మరో విమానంలోకి ఎక్కిస్తుండగా కిందపడిపోయింది. వెంటనే అధికారులు ఎయిర్ పోర్టులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే జశోధ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story