- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్ముకున్న వృత్తే యమపాశమైన వేళ
by Sumithra |
దిశ, నల్లగొండ: జీవితాన్ని ఇచ్చిన వృత్తే యమపాశమైంది. వృత్తినే నమ్ముకొని బతుకున్న ఆ వ్యక్తి అర్ధాంతరంగా మరణించడంతో అతని కుటుంబం అనాథలా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి తెగిపోయిన కేబుల్ వైర్‌ను మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో కేబుల్ ఆపరేటర్ కిందపడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలరాజు కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో కేబుల్ వైర్లు తెగిపోయాయి. దీంతో సోమవారం స్తంభమెక్కి మరమ్మత్తులు చేస్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో కింద పడ్డాడు. తలకు త్రీవ గాయం కావడంతో బాలరాజు మృతి చెందాడు. బాలరాజుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
Advertisement
Next Story