ఈనెల 5న కేబినెట్ భేటీ.. టాపిక్ ఏంటంటే..?

by Anukaran |
ఈనెల 5న కేబినెట్ భేటీ.. టాపిక్ ఏంటంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 5న రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కొత్త సచివాలయం, పంటలసాగు, నూతన అకాడమిక్ పై చర్చించనున్నారు.

కొత్త సచివాలయ నిర్మాణ డిజైన్లను కేబినెట్ ఆమోదించనున్నది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నియంత్రిత పంటలసాగుపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నిర్ణయాలను భేటీ అనంతరం మీడియాకు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story