- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zomato: 2026 వరకు జీతం తీసుకోనన్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో దీపిందర్ గోయల్ మరో రెండేళ్లు తన జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు తన వార్షిక వేతనం రూ. 3.5 కోట్లను వద్దనుకుంటున్నట్టు కంపెనీ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) డాక్యుమెంట్‌లలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే దీపిందర్ గోయల్ 2021, ఏప్రిల్ నుంచి తన వేతనాన్ని తీసుకోవట్లేదు. ఆ సమయంలో 2024 వరకు జీతాన్ని వదులుకుంటూ నిర్ణయం తీసుకోగా, దీన్ని మరో రెండేళ్లు పొడిగించారు. గోయల్ వేతనాన్ని వద్దనుకున్నప్పటికీ జొమాటో సీఈఓ, ఎండీగా కొనసాగుతారు. తద్వారా వేరియబుల్ పే లభిస్తుంది. అది ఎంత మొత్తం అనేది సంస్థ బోర్డు తదుపరి సమావేశంలో నిర్ణయిస్తుంది. కంపెనీలో కీలక వాటాదారుగా ఉన్న కారణంగా దీపిందర్ గోయల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జొమాటోలో ఆయనకు 4.18 శాతం వాటా ఉంది. దీని విలువ రూ. 10,000 కోట్లకు పైగా ఉంటుంది. కాగా, జొమాటో షేర్ ఈ ఏడాది మెరుగైన ర్యాలీని చూసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 శాతం పుంజుకుంది.