Adani Group: అదానీపై లంచం కేసు.. అమెరికా వెనక్కి తీసుకునే ఛాన్స్

by Shamantha N |
Adani Group: అదానీపై లంచం కేసు.. అమెరికా వెనక్కి తీసుకునే ఛాన్స్
X

దిశ, బిజినెస్: భారత ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై(Adani Group) దాఖలైన లంచం కేసుని అమెరికా వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. అదానీపై(Gautam Adani) వచ్చిన అభియోగాలు అనర్హమైనవి లేదా లోపభూయిష్ఠమైనవిగా పరిగణిస్తే కేసుని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది భారతీయ మూలాలున్న ప్రముఖ అటార్నీ రవి బాత్రా(Attorney Ravi Batra) తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. అదానీపై 265 మిలియన్ డాలర్ల లంచం కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రతి అధ్యక్షుడితి న్యాయజట్టు ఉంటుందని.. అసత్య ఆరోపణలతో కేసు నమోదై ఉంటే దాన్ని ప్రాసిక్యూషన్ నిర్వీర్యం చేస్తుందన్నారు. ట్రంప్ పాలకవర్గంతో ఈ సమస్యను ద్వైపాక్షికంగా లేవనెత్తాలని భారత ప్రభుత్వాన్ని గౌతమ్ అదానీ అభ్యర్థించవచ్చని అన్నారు. "క్రిమినల్ లేదా సివిల్ అభియోగాల్లో అనర్హులుగా లేదా లోపభూయిష్ఠంగా భావించినట్లైతే, ట్రంప్ పాలవర్గంలోని న్యాయ విభాగం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ కమిషన్(Securities and Exchange Commission) ఆ కేసులను ఉపసంహరించుకుంటుంది" అని రవి బాత్రా అన్నారు. ఫెడరల్ ఎగ్జిక్యూటివ్‌గా అధ్యక్షుడికి రాజ్యాంగబద్ధంగా విదేశాంగ విధానాన్ని ఏర్పాటు చేయడానికి, విచారణ చేయడానికి అధికారం ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed