- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐఫోన్‌ల కోసం టాటా గ్రూప్ అతిపెద్ద తయారీ ప్లాంట్
చెన్నై: ఐఫోన్‌ల తయారీ కోసం టాటా గ్రూప్ మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే విస్ట్రాన్‌కు చెందిన ప్లాంటును కొనుగోలు చేసిన సంస్థ త్వరలో దేశంలోనే అతిపెద్ద ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత మార్కెట్లో విస్తరణను వేగవంతం చేయాలని భావిస్తున్న యాపిల్ కంపెనీకి సహకారమందిస్తూ టాటా గ్రూప్ తమిళనాడులో కొత్త ప్లాంటును ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
12-18 నెలల్లోపు కొత్త ఫ్యాక్టరీలో కార్యకలాపాలను ప్రారంభించేలా, దాదాపు 20 అసెంబ్లీ లైన్లు, రెండేళ్లలోపు 50,000 మంది ఉద్యోగులను తీసుకునేలా టాటా గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. చైనాకు వెలుపల విడిభాగాల తయారీ, అసెంబ్లింగ్ కోసం భారత్ సహా మరో రెండు దేశాల్లో సరఫరాను పెంచాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే టాటా గ్రూప్ కొత్త ప్లాంటుపై దృష్టి సారించింది. ఈ వ్యవహారానికి సంబంధించి టాటా గ్రూప్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.