మరో మూడేళ్లు HDFC బ్యాంక్ సీఈఓగా జగదీషన్

by Harish |
మరో మూడేళ్లు HDFC బ్యాంక్ సీఈఓగా జగదీషన్
X

ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్‌ను మరో మూడేళ్ల కాలానికి కొనసాగించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్యాంకు మంగళవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 27, 2023 నుంచి 2026, అక్టోబర్ 26 వరకు శశిధర్ జగదీషన్‌ను మరోసారి 3 ఏళ్లు తిరిగి నియమించడానికి ఆమోదించింది.

తొలిసారిగా 1996లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చేరిన జగదీషన్ సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఫైనాన్స్ విభాగంలో మేనేజర్‌గా మొదలై అనేక పదవుల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1999లో బిజినెస్ హెడ్-ఫైనాన్స్, 2008లో బ్యాంకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఎదిగారు. ఆయన నాయకత్వంలోనే హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల విలీనం జరిగింది. భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ సైన్స్‌లో డిగ్రీ చేసిన శశిధర్ జగదీషన్, వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్, మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed