- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ దాడి.. 300 బ్యాంకులపై తీవ్ర ప్రభావం
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లోని పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్ (Ransomware) దాడి జరిగింది. దీంతో ఇండియాలోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని వార్తా ఏజెన్సీ సంస్థ అయినటువంటి రాయిటర్స్ తాజాగా ధ్రువీకరించింది. భారత్‌లో ఉన్న పలు రకాల చిన్నతరహా బ్యాంకులకు, బ్యాంకింగ్‌కి సంబంధించిన టెక్నాలజీ సిస్టంలు అందించే సీ - ఎడ్జ్ టెక్నాలజీస్ (Sea-Edge Technologies) పై ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే సీ - ఎడ్జ్ టెక్నాలజీ మరియు RBI లు మాత్రం ఈ విషయాన్ని వెల్లడించలేదు.
అయితే దీనికి చెందిన చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనే సంస్థ, ర్యాన్సమ్ వేర్ దాడి ఘటన తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, కోఆపరేటివ్ సాంకేతిక సేవలు అందించే సీ - ఎడ్జ్ టెక్నాలజీస్ పై ర్యాన్సమ్ వేర్ దాడి ఘటనతో తీవ్ర ప్రభావం పడినట్లు ఒక పబ్లిక్ అడ్వైజరీ పేర్కొంది. ఈ సందర్బంగా రిటైల్ పేమెంట్స్ తో సీ - ఎడ్జ్ సాంకేతికను తాత్కాలికంగా వేరుచేసినట్లు తెలిపింది. దీనితో పాటు ఈ సంస్థ సేవలు అందిస్తున్న పలు బ్యాంకుల కస్టమర్లు ప్రస్తుత సమయంలో సేవలు పొందలేరని, దీనికి సంబంధించిన పునరుద్ధరణ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు తెలిపింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి చెల్లింపులు నిలిచిపోయిన బ్యాంకుల ఖాతాలు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని పేర్కొంది.