- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటివరకు 7.76 కోట్ల రిటర్నుల దాఖలు
by Harish |
X
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 2వ తేదీ వరకు 7.76 కోట్ల పన్ను రిటర్నులు దాఖలయ్యాయని, ఈ నెలాఖరులోగా మరిన్ని దాఖలు అవనున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. సోమవారం పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, 2022-23లో 10.09 కోట్ల పాన్ కార్డు దారులు అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి పన్నులు చెల్లించారు. ఈ క్రమంలో 2023, డిసెంబర్ 31 నాటికి మరిన్ని రిటర్నులు దాఖలవుతాయని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
సమీక్షించిన కాలానికి ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఫైల్ చేసేందుకు ఈ ఏడాది జులై 31 వరకే గడువు ఉంది. ఆ తర్వాత దాఖలు చేసేవారు జరిమానాతో డిసెంబర్ 31 వరకు దాఖలు చేయవచ్చు. కాగా, 2022-23లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ.16.63 లక్షల కోట్లు కాగా, అందులో ఆదాయపు పన్ను వసూళ్లు రూ.8.08 లక్షల కోట్లుగా ఉన్నాయి.
Advertisement
Next Story