- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు నెలల కనిష్టానికి పడిపోయిన తయారీ కార్యకలాపాలు!
న్యూఢిల్లీ: భారత తయారీ రంగ కార్యకలాపాలు సెప్టెంబర్‌లో మూడు నెలల కనిష్టానికి పడిపోయాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం, బలమైన వ్యాపార విశ్వాసం ఉన్నప్పటికీ డిమాండ్, ఉత్పత్తి తక్కువ స్థాయిలో పెరగడంతో ఎస్అండ్‌పీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) కాస్త నెమ్మదించింది. ఆగష్టులో పీఎంఐ సూచీ 56.2 పాయింట్లుగా నమోదైన తర్వాత గత నెలలో ఇది 55.1కి తగ్గింది. ఇదే సమయంలో కొత్త ఎగుమతుల ఆర్డర్లు వరుసగా ఆరవ నెలలో పెరిగాయి. 2022, మే నెలలో అత్యంత వేగంగా కొత్త ఆర్డర్లు పెరుగుతున్నాయని ఎస్అండ్‌పీ గ్లోబల్ నివేదిక తెలిపింది.
గత రెండేళ్లలోనే తక్కువ రేటుకు ఇన్‌పుట్ ఖర్చులు తగ్గినప్పటికీ, ముడి పదార్థాల కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ తగ్గడం, మాంద్యం ఆందోళనల నేపథ్యంలో దేశీయంగా కొత్త ఆర్డర్లు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే వృద్ధిగానూ, దానికంటే తక్కువగా నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు. అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత తయారీ పరిశ్రమ మెరుగైన స్థితిలోనే ఉందని ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా అన్నారు.