ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర 5జీ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా జియో!

by Harish |
ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర 5జీ నెట్‌వర్క్‌ ఆపరేటర్‌గా జియో!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ ఏడాది ప్రపంచంలోనే మెరుగైన 5జీ నెట్‌వర్క్‌ను కలిగిన అతిపెద్ద కంపెనీగా అవతరించనుందని కంపెనీ అధ్యక్షుడు మాథ్యూ ఊమన్ అన్నారు. గురువారం జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న ఆయన, భారత వృద్ధికి జియో కీలక మద్దతుగా నిలవడంలో ముందుంటుందని, 2023 ద్వితీయార్థం నాటికి తాము ప్రపంచంలోనే అతిపెద్ద స్వతంత్ర 5జీ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా ఉంటామని, అన్ని రకాల అధునాత సేవలు, సామర్థ్యాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు.

అయితే, ఇటీవల టెలికాం రంగంలో రాబడి తక్కువగా ఉన్నందున ఈ ఏడాది కాల్, డేటా ధరలు పెరుగుతాయని ఎయిర్‌టెల్ ఛైర్మన్ భారతీ మిట్టల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై మాథ్యూ ఊమన్‌ను అడగ్గా, ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం రిలయన్స్ జియో తన 5జీ నెట్‌వర్క్‌ను 300 కంటే ఎక్కువ నగరల్లో విస్తరించిందని పేర్కొన్నారు. కాగా, భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటివరకు దేశంలో 140 నగరాల్లో తన 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed